ముక్తాపూర్ గ్రామాంలో కల్తీ పాల తయారీదారుడు అరెస్ట్

భూదాన్ పోచంపల్లి, వెలుగు : కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్​ చేశారు.  పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన సన్న ప్రశాంత్ కొంతకాలంగా కల్తీ పాలు తయారుచేసి విక్రయిస్తున్నాడు. 

విషయం తెలుసుకున్న ఎస్​వోటీ పోలీసులు మంగళవారం ప్రశాంత్ ఇంటిపై దాడులు చేసి 60 లీటర్ల కల్తీ పాలు, 250 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 ప్యాకెట్ల మిల్క్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రశాంత్​ను అరెస్ట్​ చేసి భూదాన్ పోచంపల్లి పీఎస్​కు తరలించారు.