ఇన్‌స్టాగ్రామ్ బయో ఛేంజ్ .. భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్?

టీమిండియా క్రికెటర్  భువనేశ్వర్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ బయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో భువనేశ్వర్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో టీమిండియా క్రికెటర్ అని ఉండేది. కానీ ప్రస్తుతం దానిని ఇండియన్  గా మార్చాడు. 

దీంతో భువనేశ్వర్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా  అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో భువనేశ్వర్ అభిమానులు అతని పాత, కొత్త ఇన్‌స్టాగ్రామ్ బయోలను షేర్ చేస్తున్నారు.  

AsloRead: రెయిన్​ఎఫెక్ట్: హిమాయత్​ సాగర్​ 4 గేట్లు ఎత్తిన్రు.. 

భారత్ తరఫున భువనేశ్వర్ కుమార్  21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 61 వికెట్లు, వన్డేల్లో 132 వికెట్లు, టీ20ల్లో 49 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లలోనూ ఐదు వికెట్ల హాల్ సాధించిన ఏకైక భారత బౌలర్ భువీనే కావడం విశేషం.  

భువనేశ్వర్ కుమార్ 2022 జనవరిలో  భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. పార్ల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఆ  మ్యాచ్ లో భువీ.. 8 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. పేలవ ప్రదర్శనకు తోడు గాయాలు వెంబడించడంతో  భువీ జట్టుకు దూరం అవుతూ వస్తున్నాడు.