RCB Vs GT: స్వింగ్ కింగ్ తడాఖా: ఐపీఎల్‎లో ఆల్‌టైం రికార్డ్ సమం చేసిన భువనేశ్వర్

RCB Vs GT: స్వింగ్ కింగ్ తడాఖా: ఐపీఎల్‎లో ఆల్‌టైం రికార్డ్ సమం చేసిన భువనేశ్వర్

ఐపీఎల్ లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన నిలకడను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ను ఒకటి సెట్ చేశాడు. ఈ మెగా లీగ్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఫాస్ట్ బౌలర్ గా వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో, భువీ ఇద్దరూ ఇప్పటివరకు ఐపీఎల్ లో 183 వికెట్లు తీసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 2) చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ వికెట్ ను తీసుకొన్న గిల్.. ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. 

ALSO READ | RCB Vs GT: ఆర్సీబీపై నిప్పులు చెరిగిన సిరాజ్.. గుజరాత్ ముందు ఓ మాదిరి లక్ష్యం

ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి భువీ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడిన గిల్ థర్డ్ మ్యాన్ చేతికి చిక్కాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు మూడు ఓవర్లు వేసిన ఈ ఆర్సీబీ స్టార్ పేసర్.. 14 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చివరి ఓవర్ లో మరో వికెట్ తీస్తే ఈ మ్యాచ్ లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఫాస్ట్ బౌలర్ గా నిలవొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్ లో 178 మ్యాచ్ లాడిన భువీ 7.55 ఎకానమీతో 183 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 

ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే 170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. గుజరాత్ గెలవాలంటే చివరి పది ఓవర్లలో 88 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్ లో బట్లర్ (27), సాయి సుదర్శన్ (37) ఉన్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54: ఫోర్, 5 సిక్సర్లు) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.