Buvaneshwar Kumar- Nupur Nagar: భార్య పుట్టిన రోజు.. స‌ర్‌ప్రైజ్ చేసిన భువీ

Buvaneshwar Kumar- Nupur Nagar: భార్య పుట్టిన రోజు.. స‌ర్‌ప్రైజ్ చేసిన భువీ

భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్లూ జెర్సీలో క‌నిపించి ఎన్నాళ్లవుతోందో కదా..!. గత రెండేండ్లుగా భారత జట్టుకు ఎంపిక కాని భువీ.. దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అభిమానులను అల‌రిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ స్వింగ్ మాస్టర్ త‌న భార్య నుపుర్ న‌గ‌ర్ పుట్టిన రోజును చాలా ప్ర‌త్యేకంగా ప్లాన్ చేశాడు.

1991, ఆగస్టు 15న జన్మించిన నుపుర్.. గురువారంతో ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకొని 33వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో భువీ.. భార్యపై తనకున్న అంతులేని ప్రేమ‌ను ఆశ్చ‌ర్యప‌రిచే రీతిలో చూపించాడు. దాంతో, పుట్టినరోజు నాడు స‌ర్‌ప్రైజ్ సెల‌బ్రేష‌న్‌తో నుపుర్ తెగ మురిసిపోయింది. అనంత‌రం స్నేహితుల స‌మ‌క్షంలో నుపుర్ కేకు క‌ట్ చేసింది. అందుకు సంబందించిన వీడియోను భువీ సతీమణి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 

"పుట్టినరోజు నాడు నన్ను ఆశ్చర్యపరచడంలో భువీ మరోసారి విఫలం కాలేదు! ఈ అద్భుత క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నా జన్మదినాన్ని ఇంతా అద్భుతమైన ఆహ్లాదకరమైన రాత్రిని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.." అని నుపుర్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nupur Nagar (@nupurnagar)

2017 నవంబర్ 23న భువనేశ్వర్, నుపుర్‌ల వివాహం జరగ్గా..  నవంబర్ 2021లో ఈ జంటకు ఒక కుమార్తె జన్మిచింది.

నిఖార్సైన స్వింగ్ బౌలర్

బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల భువీ.. కెరీర్ తొలినాళ్లలో భార‌త క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగాడు. 2012లో అరంగేట్రం చేసిన భువీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఔరా అనిపించాడు. అయితే, కెరీర్ అద్భుతంగా సాగుతున్నద‌శ‌లో గాయాలు, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు అతని కెరీర్‌ను ప్ర‌శ్నార్థ‌కం చేశాయి. దాంతో, 2022 నవంబర్‌ తర్వాత అతను జాతీయ జట్టులో కనిపించలేదు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు తరపున ఆడాడు. భారత జట్టు తరుపున 21 టెస్టులు, 121 వ‌న్డేలు, 87 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్ల‌లో మొత్తంగా 294 వికెట్లు తీశాడు. 

ఐపీఎల్‌నూ ఈ స్వింగ్ సుల్తాన్ అబ్బుర‌ప‌రిచే గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. ఇప్ప‌టికీ అతనే సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్ర‌ధాన బౌల‌ర్‌. ఈ ఏడాది ఐపీఎల్లో భువీ 16 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో అద్భుత ఆట తీరుతో ఫైనల్‌ వరకు వచ్చిన సన్ రైజర్స్.. తుది పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది.