
యాదాద్రి, వెలుగు : ఖాళీ ప్లాట్లకు పాస్బుక్స్ఇచ్చిన యాదాద్రి జిల్లా బీబీనగర్ తహసీల్దార్సస్పెండ్ అయ్యారు. గతంలో బీబీనగర్మండల పరిధిలో భారీగా రియల్ఎస్టేట్బిజినెస్నడిచింది. వేల ఎకరాల్లో వెంచర్లు చేసి ప్లాట్లను చేసి అమ్మారు. రూల్స్ కు విరుద్ధంగా అమ్మకాలు చేసిన పలు రియల్ఎస్టేట్సంస్థలపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
కాగా బీబీనగర్మండలం పడమటి సోమారంలోని పది సర్వే నంబర్లలో కొన్ని ఖాళీ ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తహసీల్దార్శ్రీధర్ పాస్బుక్స్జారీ చేశారు. దీనిపై ఫిర్యాదు వెళ్లడంతో కలెక్టర్హనుమంతరావు ప్రాథమికంగా విచారణ చేయించారు. వాస్తవాలు తెలియడంతో తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.