మంగపేట మండలంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

 మంగపేట మండలంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థినులకు 100 ఫర్ 100 ఫౌండేషన్, రోటరీ క్లబ్, నళిని ఫౌండేషన్ సంయుక్తంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ సలహదారు, 100 ఫర్ 100 స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థినులు స్కూల్​కు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కమలాపురం, తిమ్మంపేట, రాజుపేట, మల్లూరు, మంగపేట హైస్కూళ్లతోపాటు మంగపేట ప్రభుత్వ కాలేజ్ బాలికలకు వంద సైకిళ్లను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నళిని ఫౌండేషన్ ఫౌండర్ విష్ణు కుమార్ శర్మ, రోటరీ క్లబ్ వరంగల్ సభ్యులు, మంగపేట ఎంఈవో పోదెం మేనక, ప్రోగ్రాం సమన్వయకర్త చందా భద్రయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్, బాలాజీ, సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.