2 ఇండియన్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు

న్యూఢిల్లీ: యూఎస్‌‌‌లోని బైడెన్ ప్రభుత్వం తమ చివరి రోజు  రెండు ఇండియన్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. రష్యాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఈ రెండు కంపెనీలు ఉల్లంఘించాయని పేర్కొంది. రష్యా నుంచి ఈ ఇండియన్ కంపెనీలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌‌జీ)ని రవాణా చేస్తున్నాయి. 

యూఎస్‌ ప్రభుత్వం మొత్తం 200 కంపెనీలపై ఆంక్షలు పెట్టగా,  ఇందులో ఇండియా నుంచి స్కైహర్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సర్వీసెస్‌‌, అవిజన్‌‌ మేనేజ్‌‌మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. మొత్తం 180 వెసల్స్‌‌ను బ్లాక్డ్‌‌ ప్రాపర్టీగా యూఎస్‌ గుర్తించింది. ఈ చర్యలతో రష్యా ఆదాయం తగ్గుతుందని అమెరికా భావిస్తోంది. 

రష్యా నుంచి ఎల్‌‌ఎన్‌‌జీని ఎగుమతి చేస్తున్న 80 కంపెనీలపై యూఎస్‌ ఆంక్షలు పెట్టింది. రష్యా ఆయిల్ ప్రొడక్షన్‌‌ కెపాసిటీని పెంచే కంపెనీలు, ఆర్కిటిక్ ఎల్‌‌ఎన్‌‌జీ 2 ప్రాజెక్ట్‌‌ను సపోర్ట్ చేస్తున్న కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.