AI తో వీళ్లను కూడా వదిలిపెట్టలేదు సల్సా చేయించారు

ఏఐ టెక్నాలజీతో చేసిన ఫొటోస్, వీడియోస్ కు సోషల్ మీడియాలో అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ప్రముఖుల ఫేస్ మార్నింగ్ తో స్వయంగా వారే పాడినట్టు, చేసినట్లు కొందరు క్రియోట్ చేస్తున్నారు. మోదీ, రష్మిక, కేసీఆర్, సల్మాన్ ఖాన్, జగన్ ల ఏఐ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అమెరికా అగ్రనేతలైన ప్రస్తుత, మాజీ అధ్యక్షులు వైరల్ అవుతున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నంచి డ్రోలాల్డ్ ట్రాంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడన్ పోటీ చేశారు. ప్రత్యర్థులైన వీరిని AI టెక్నాలజీతో సల్సా  డ్యాన్స్ చేసినట్లుగా ఓ వీడియో రూపొందించారు. 

ఈ వీడియోలో 21 సెకండ్ల లాటిన్ సాంగ్ కు ఒకరికొకరు చేతులు పట్టుకొని సల్సా  డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. మీ ఇద్దరిదీ విడదీయలేని బంధమంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ మారియో నౌఫాల్ ఈ వీడియో తన ట్విట్టర్ లో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల కామెంట్స్, షేర్స్ చేస్తుండగా వైరల్ అవుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీల్లో వీరిద్దరూ డ్యాన్స్ చేసి ఓటర్లను ఆకర్షించిన విషయం తెలిసిందే.   డిజిటల్ వీడియో క్రియేటర్ యూరి యాల్ట్సోవ్ ఫస్ట్ టైం ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.