
వాషింగ్టన్: ప్రెసిడెన్షియల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోబోనని ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతల నుంచే తనకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా బైడెన్ లెక్కచేయట్లేదు. వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలోనే ఉంటానని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘డొనాల్డ్ ట్రంప్‌కు విజన్ లేదు. అమెరికన్ల ప్రయోజనాలపై పట్టింపు లేదు. ఒక పార్టీగా, ఒక దేశంగా బ్యాలెట్ పోరులో మేం ట్రంప్ ను ఓడించగలం.. ఓడిస్తాం. వచ్చే వారం నుంచి క్యాంపెయిన్ లో పాల్గొంటాను” అని బైడెన్ అందులో పేర్కొన్నారు.