అమెరికాలో డెమెక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడన్ ఎన్నికల నుంచి తప్పుకున్నాడు. శనివారం ఆయన ఉపసంహరణ పత్రాన్ని ఉపాధ్యక్షులు కమలా హరీస్ ఆమెదించారు. ఆగస్ట్ లో జరిగే డెమెక్రాటిక్ పార్టీ నాయకులు అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన కమలా హరీస్ ఉన్నారని వార్తలు వినపిస్తున్నాయి.
అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకొని ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ కు ఆయన మద్దతు తెలిపారు.
2020లో పార్టీ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ను ఎంపికచేస్తూ బైడెన్ తీసుకున్న తీసుకున్న నిర్ణయం సరైందే అని ఎక్స్ లో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఉండేందుకు ఈ రోజు నా మద్దతు ప్రకటిస్తున్నాను అరి ట్విట్ చేశారు. డెమోక్రటిక్ నేతలందరం కలిసి ట్రంప్ ని ఓడించాల్సిన సమయం వచ్చిందని శనివారం బైడెన్ పిలుపునిచ్చారు.
59 ఏళ్ల కమలా హారిస్ డెమోక్రాట్లు అభ్యర్థిగా ఆమోదిస్తే.. అమెరికా హిస్టరీలోనే కీలక నిర్ణయం కానుంది. ఓ ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలవనున్న తొలి ఆసియా సంతతి మహిళగా చరిత్రకెక్కనుంది. అయితే ఆమెను పార్టీ తమ అభ్యర్థిగా అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. పార్టీ నామినేషన్ కోసం సీనియర్ డెమోక్రాట్ల నుంచి ఆమె సవాళ్లు ఎదుర్కొంటున్నారు.