వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నేతృత్వంలో ఇండో అమెరికన్లు దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకు న్నారు. దేశ వ్యాప్తంగా టెంపుల్స్, ఐకానిక్ ప్లేసెస్ లో దీపాల వెలుగులు జిగేల్ మన్నాయి.
Tonight, we join more than 1 billion people across America and around the world lighting diyas and celebrating the fight for good over evil, knowledge over ignorance, and light over darkness.
— Vice President Kamala Harris (@VP) October 31, 2024
Happy Diwali to everyone celebrating the Festival of Lights! pic.twitter.com/VhgCkjeieg
అధ్యక్షుడు బిడెన్, కమలా హారీస్ ప్రజలతో కలిసి దీపావళి వేడుకులు జరుపుకున్నా రు. సంబరాల్లో మునిగి తేలినవీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా పంచుకున్నారు.
దీపావళి పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్. ‘‘ఈ రాత్రి మేం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నాం.. దీపావళి చెడుపైమంచికోసం చేసిన పోరాటం, అజ్ణానంపై జ్ణానం, చీకటిపై కాంతి చేసిన పోరాటం’’ అని కమలా హారిస్ ట్వీట్ చేశారు.
Also Read : జమ్మూకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
ఈ వారం ప్రారంభంలో అమెరికా దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది భారతీయ అమెరికన్లను ఆహ్వానించి వైట్ హౌజ్ లో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అతిపెద్ద దీపావళి పండుగను నిర్వహించారు.
మరో వైపు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సంతోషకరమైన దీపావ ళి జరుపుకోవాలని సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.