సరిహద్దు గోడ మెటీరియెల్​ను సీక్రెట్​గా అమ్మేస్తున్న బైడెన్

సరిహద్దు గోడ మెటీరియెల్​ను సీక్రెట్​గా అమ్మేస్తున్న బైడెన్
  • ట్రంప్ హామీ అమలును అడ్డుకునే యత్నమంటూ కథనాలు 

వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దు గోడ భాగాలను ప్రెసిడెంట్  జో బైడెన్  ప్రభుత్వం సీక్రెట్ గా అమ్మేస్తోంది. తాను అధికారం చేపట్టిన తర్వాత సరిహద్దు గోడను పునర్నిర్మిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్  ట్రంప్  ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో అధ్యక్ష పదవి నుంచి వెళ్లిపోయే ముందు.. ట్రంప్  ఇచ్చిన హామీల అమలును బైడెన్  పాలకవర్గం అడ్డుకునే యత్నం చేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. 

అమెరికాకు దక్షిణం వైపు ఉన్న టక్సన్, ఆరిజోనా సరిహద్దులో వాడుకలో లేని గోడ భాగాలను (మెటీరియల్) రహస్యంగా డిస్మాంటిల్  చేస్తున్నట్లు యూఎస్  కస్టమ్స్  అండ్  బోర్డర్  ఏజెంట్  తీసిన వీడియోలో వెలుగులోకి వచ్చింది. గతంలో అక్కడ ఏర్పాటు చేసిన షీట్లు ఒక్కొక్కటిగా మాయమైన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. 

నోగేల్స్, టక్సన్, మరో మూడు ప్రాంతాల వద్ద బోర్డర్  మెటీరియల్ మాయం చేశారని  ఓ అధికారి చెప్పారు. వేరుచేసిన మెటీరియల్ ను మారానాలోని పైనల్  ఎయిర్ పార్క్ కు రవాణాచేసి గోవ్ ప్లానెట్  ద్వారా ఆన్ లైన్ లో వేలంవేసి అమ్మేస్తున్నారని ఆయన వెల్లడించారు. కాగా.. 2021లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్  ఇమిగ్రేషన్  పాలసీని బైడెన్  ఉపసంహరించారు. దీంతో అమెరికా‌‌‌‌‌‌‌‌–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం ఆగిపోయింది. దీంతో దక్షిణం వైపు నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగాయి.

నలుగురు ఇండియన్ అమెరికన్లకు క్షమాభిక్ష.. 

వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న 1500 మందికి అధ్యక్షుడు బైడెన్  శిక్షను తగ్గించారు. అంతేకాకుండా 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఆ 39 మందిలో నలుగురు ఇండియన్  అమెరికన్లు ఉన్నారు.