
వాషింగ్టన్: బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిణామాలపై ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్‌లో మాట్లాడారని వైట్ హౌస్ వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‍లో పరిణామాలు, ప్రజాస్వామ్యంపై వారిద్దరూ చర్చించారని, ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీల ఊచకోతపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారని వైట్ హౌస్ వర్గాలు బుధవారం తెలిపాయి. అలాగే, రష్యా – -ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన సంక్షోభానికి ముగింపు పలకడంలో ఏ దేశం ముందుకు వచ్చినా తాము ఆహ్వానిస్తామని బైడెన్ చెప్పారని వెల్లడించాయి.