కరోనాపై ఫైట్‌కు బైడెన్​ టాస్క్‌‌ఫోర్స్‌‌

కో–చైర్ పర్సన్ గా డాక్టర్ వివేక్ మూర్తి

న్యూయార్క్: ప్రెసిడెన్షియల్​ ఎన్నికల్లో గెలిచినట్లు ఇంకా అఫీషియల్ ​ప్రకటన రానేలేదు.. కానీ జో బైడెన్​ అప్పుడే పనిలోకి దిగిండు. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు ఏర్పాట్లు మొదలెట్టిండు.  కరోనాపై పోరుకు ఓ టాస్క్​ఫోర్స్​ను నియమిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకున్నడు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేశారు. 19 మంది డాక్టర్లు, సైంటిస్టులతో టాస్క్​ఫోర్స్​ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.  ఇందులో ముగ్గురు కో–చైర్మన్లు ఉంటారు. వీరిలో ఇండియన్​ అమెరికన్​ డాక్టర్​ వివేక్​ మూర్తి  ఒకరు. ఈ టాస్క్​ఫోర్స్​ కరోనా కంట్రోల్​పై బైడెన్​కు, కమలా హారిస్​ కు​ సలహాలు ఇస్తుంది. ఒబామా హయాంలో సర్జన్​ జనరల్​గా పనిచేసిన వివేక్​ మూర్తిని.. ట్రంప్​ అధికారంలోకి వచ్చాక 2017లో డిస్మిస్​ చేశారు. యూఎస్​ఎఫ్​డీ మాజీ కమిషనర్​ డాక్టర్​ డేవిడ్​ కెస్లర్, డాక్టర్​ నునెజ్​ స్మిత్​ కూడా​ టాస్క్​ఫోర్స్​ కో–చైర్మన్లుగా పనిచేస్తారు. కరోనాపై పోరాటానికి ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తామని బైడెన్ ఇది వరకే​ స్పష్టం చేశారు.‘‘వ్యాధిని ఎలా అదుపు చేయాలో ఈ టాస్క్​ఫోర్స్​ ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తుంది. వ్యాక్సిన్లు అందరికీ సురక్షితంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్య లను సూచిస్తుంది. రిస్క్​లో ఉన్న వారిని కాపాడటంలో ప్రభుత్వానికి సాయపడుతుంది” అని వివరించారు. కరోనాను కంట్రోల్​ చేయడంలో ట్రంప్​ పూర్తిగా ఫెయిలయ్యారని, కనీసం మాస్క్​ పెట్టుకోవడమూ ఆయనకు ఇష్టం లేదని ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్​ విమర్శించారు. కరోనా కంట్రోల్​ ప్లాన్​ అమలుతోనే తన పని మొదలవుతుందని గెలుపు అనంతరం ప్రకటించారు. మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా కరోనాతో తీవ్రంగా నష్టపోయింది. శనివారం ఒక్కరోజే 1.30 లక్షల మంది ఈ వ్యాధి బారినపడగా, మొత్తం కేసుల సంఖ్య 99.67 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు 2.37 లక్షల మందికిపైగా మరణించారని జాన్స్​ హాప్కిన్స్​ యూనివర్సిటీ ప్రకటించింది.

For More News..

నేనోడిపోలే.. కుర్చీ దిగ