బైడెన్ కు కరోనా పాజిటివ్.. వెల్లడించిన వైట్ హౌస్.. 

బైడెన్ కు కరోనా పాజిటివ్.. వెల్లడించిన వైట్ హౌస్.. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వెల్లడించింది. బుధవారం లాస్ వెగాస్ పర్యటనలో ఉన్న బైడెన్ కు కరోనా పరీక్ష చేయగా తేలికపాటి లక్షణాలు గుర్తించినట్లు తెలిపింది వైట్ హౌస్. ఈ నేపథ్యంలో షెడ్యూల్ లో ప్లాన్ చేసిన కార్యక్రమాల్లో బైడెన్ పాల్గొనటం లేదని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.

కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన తర్వాత లాస్ వేగాస్ నుండి బయల్దేరి వైట్ హౌస్ లో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ నిర్దారణ కాకముందు బైడెన్ 12మందిని కలిశారని తెలిపింది.

ఈ క్రమంలో అధ్యక్ష పదవి నుండి బైడెన్ తప్పుకోవాలంటూ డెమొక్రాట్స్ నుండి ఒత్తిడి మరింత పెరిగింది.ఎన్నికల్లో పోటీ చేసేందుకు బైడెన్ వయసు కూడా సహకరించదని, అధ్యక్ష రేసు నుండి స్వచ్ఛందంగా తప్పుకొని వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలన్న వాదన వినిఇస్తున్నారు డెమొక్రాట్స్.