అధికారులను అలర్ట్ చేసినందుకు భారత సిబ్బందికి థ్యాంక్స్ : బైడెన్

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందే. బాల్టిమోర్ నగరంలోని 2.57 కి.మీ. పొడవున్న ప్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జీని కంటైనర్ షిప్ ఢీకొన్న తర్వాత కనిపించకుండా పోయిన ఆరుగురు కార్మికులు చనిపోయినట్లు యూఎస్ అధికారులు భావిస్తున్నారు. నౌకపై నియంత్రణ కోల్పోయిన అధికారులను అప్రమత్తం చేసిన ఓడలోని భారతీయ  సిబ్బందికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ థ్యాంక్స్ చెప్పారు. 

బ్రిడ్జిని డాలి అనే కంటైన్ షిప్ మంగళవారం తెల్లవారుజామున ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ షిప్ లో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. కంటైనర్ లో ఉన్న ఇద్దరు ఫైలట్ లతో సహా భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

సింగపూర్ కు చెందిన డాలి కంటైనర్ షిప్ బాల్టిమోర్ పోర్ట్ నుంచి సరుకు రవాణా నౌక డాలి బయలుదేరి శ్రీలంకలోని కొలంబోకు వెళుతోంది. దాదాపు 20 నిమిషాల్లో ఈ షిప్ వంతెనను చేరుకుంది. ప్రమాద సమయంలో ఓడ పూర్తిగా కరెంట్ ను కోల్పోవడంతో కనిపిస్తోంది. ఫలితంగా ఓడలో చీకట్లు కమ్ముకున్నాయి. తెల్లవారు జామున 1.27 గంటల సమయంలో ఓడ ప్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను ఢీకొట్టింది.