ప్రెసిడెంట్​ రేసులో మళ్లీ బైడెన్ x ట్రంప్

 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్​ తలపడనున్నారు. డెమొక్రటిక్​ పార్టీ తరఫున బైడెన్, రిపబ్లికన్​ పార్టీ నుంచి ట్రంప్​ అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో వారిద్దరి మధ్య పోటీ అనివార్యమైంది. జార్జియా ప్రైమరీలో గెలుపొందిన బైడెన్.. 1,968 మంది ప్రతినిధుల మద్దతుతో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

‘దేశ భవిష్యత్తును రక్షించే అవకాశం మీ చేతుల్లో ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా?  లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమ తిస్తారా?’ అని మద్దతుదారులను ప్రశ్నిం చారు. తనపై విశ్వాసం ఉంచి నామినేట్ చేసినందుకు ప్రతినిధులందరికీ బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక, రిపబ్లికన్ పార్టీ తరఫున 77 ఏండ్ల ట్రంప్ ​ఇటీవలి సూపర్ ట్యూస్ డే ప్రైమరీలో ఒక్కటి మినహా మిగతా వన్నీ గెలుచుకున్నారు. 

వరుస ఓటముల నేపథ్యంలో నిక్కీ హేలీ అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ వరుసగా రిపబ్లికన్​ పార్టీకి మూడుసార్లు నాయకత్వం వహిస్తున్న ఘనత సొంతం చేసుకొన్నారు.