Big Bash League 2024: ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్.. బిగ్ బాష్ షెడ్యూల్ ప్రకటన

ప్రపంచ క్రికెట్ లీగ్ బిగ్ బాష్ లీగ్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఐపీఎల్ తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఈ లీగ్ చూడడానికే ఆసక్తి చూపిస్తారు. ఇప్పటివరకు 13 సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాష్ లీగ్.. తాజాగా 14వ సీజన్ కు సిద్ధమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదల చేశారు. డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జనవరి 27 తో ముగుస్తుంది. 

Also Read: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. దిగ్గజాల సరసన ఇంగ్లాండ్ కెప్టెన్

సీజన్ తొలి మ్యాచ్ లో పెర్త్ స్కార్చర్స్ తో మెల్‌బోర్న్ స్టార్స్ తలపడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బ్రిస్బేన్ హీట్ బరిలోకి దిగుతుంది. పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్,సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్,సిడ్నీ థండర్ vs అడిలైడ్ స్ట్రైకర్స్,బ్రిస్బేన్ హీట్,హోబర్ట్ హరికేన్స్ టైటిల్ కోసం తలపడతాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు భారత్ తో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత వీరు తమ తమ జట్లలో చేరతారు.     

బిగ్ బాష్ లీగ్ పూర్తి షెడ్యూల్:

డిసెంబర్ 15, 2024 – పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – ఆప్టస్ స్టేడియం
డిసెంబర్ 16, 2024 – సిడ్నీ సిక్సర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – SCG
డిసెంబర్ 17, 2024 – సిడ్నీ థండర్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – మనుకా ఓవల్
డిసెంబర్ 18, 2024 – మెల్‌బోర్న్ స్టార్స్ vs బ్రిస్బేన్ హీట్ – MCG
డిసెంబర్ 19, 2024 – మెల్బోర్న్ రెనెగేడ్స్ vs హోబర్ట్ హరికేన్స్- GMHBA స్టేడియం
డిసెంబర్ 20, 2024 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – అడిలైడ్ ఓవల్
డిసెంబర్ 21, 2024 – హోబర్ట్ హరికేన్స్ vs పెర్త్ స్కార్చర్స్ – బ్లండ్‌స్టోన్ అరేనా
డిసెంబర్ 21, 2024 – సిడ్నీ థండర్ vs సిడ్నీ సిక్సర్స్ – ENGIE స్టేడియం
డిసెంబర్ 22, 2024 – బ్రిస్బేన్ హీట్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – గబ్బా
డిసెంబర్ 23, 2024 – మెల్బోర్న్ రెనెగేడ్స్ vs పెర్త్ స్కార్చర్స్ – మార్వెల్ స్టేడియం
డిసెంబర్ 26, 2024 – సిడ్నీ సిక్సర్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – SCG
డిసెంబర్ 26, 2024 – పెర్త్ స్కార్చర్స్ vs బ్రిస్బేన్ హీట్ – ఆప్టస్ స్టేడియం
డిసెంబర్ 27, 2024 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs హోబర్ట్ హరికేన్స్ – అడిలైడ్ ఓవల్
డిసెంబర్ 28, 2024 – మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ థండర్ – మనుకా ఓవల్
డిసెంబర్ 29, 2024 – బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ సిక్సర్స్ – గబ్బా
డిసెంబర్ 30, 2024 – సిడ్నీ థండర్ vs మెల్‌బోర్న్ రెనెగేడ్స్ – ENGIE స్టేడియం
డిసెంబర్ 31, 2024 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs పెర్త్ స్కార్చర్స్ – అడిలైడ్ ఓవల్
జనవరి 6, 2025 – బ్రిస్బేన్ హీట్ vs సిడ్నీ థండర్ – గబ్బా
జనవరి 7, 2025 – పెర్త్ స్కార్చర్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – ఆప్టస్ స్టేడియం
జనవరి 8, 2025 – సిడ్నీ థండర్ vs హోబర్ట్ హరికేన్స్ – ENGIE స్టేడియం
జనవరి 9, 2025 – మెల్‌బోర్న్ స్టార్స్ vs సిడ్నీ సిక్సర్స్ – MCG
జనవరి 10, 2025 – హోబర్ట్ హరికేన్స్ vs సిడ్నీ థండర్ – బ్లండ్‌స్టోన్ అరేనా
జనవరి 11, 2025 – సిడ్నీ సిక్సర్స్ vs పెర్త్ స్కార్చర్స్ – SCG
జనవరి 11, 2025 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs బ్రిస్బేన్ హీట్ – అడిలైడ్ ఓవల్
జనవరి 12, 2025 – మెల్బోర్న్ రెనెగేడ్స్ vs మెల్బోర్న్ స్టార్స్ – మార్వెల్ స్టేడియం
జనవరి 13, 2025 – సిడ్నీ థండర్ vs పెర్త్ స్కార్చర్స్ – ENGIE స్టేడియం
జనవరి 14, 2025 – హోబర్ట్ హరికేన్స్ vs మెల్బోర్న్ రెనెగేడ్స్ – బ్లండ్‌స్టోన్ అరేనా
జనవరి 15, 2025 – అడిలైడ్ స్ట్రైకర్స్ vs సిడ్నీ సిక్సర్స్ – అడిలైడ్ ఓవల్
జనవరి 16, 2025 – బ్రిస్బేన్ హీట్ vs హోబర్ట్ హరికేన్స్ – గబ్బా
జనవరి 17, 2025 – సిడ్నీ సిక్సర్స్ vs సిడ్నీ థండర్ – SCG
జనవరి 18, 2025 – మెల్‌బోర్న్ రెనెగేడ్స్ vs బ్రిస్బేన్ హీట్ – మార్వెల్ స్టేడియం
జనవరి 18, 2025 – పెర్త్ స్కార్చర్స్ vs అడిలైడ్ స్ట్రైకర్స్ – ఆప్టస్ స్టేడియం
జనవరి 19, 2025 – మెల్‌బోర్న్ స్టార్స్ vs హోబర్ట్ హరికేన్స్ – MCG
జనవరి 21, 2025 – TBD, క్వాలిఫైయర్
జనవరి 22, 2025 - TBD, నాకౌట్
జనవరి 24, 2025 - TBD, ది ఛాలెంజర్
జనవరి 27, 2025 - TBD, ది ఫైనల్స్