మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(MVA)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వెనకబాటుతో వైదొలగాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ శనివారం(డిసెంబర్ 7) ప్రకటిం చారు.
మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో మహా వికాస్ అఘాడి 30 స్థానాలను గెలుచుకుంది. అయినా నవంబర్ 20న జరిగిన రాష్ట్ర ఎన్నికలలో 288 స్థానాలకు గానూ అది 49 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. శివసేన (UBT) 20, కాంగ్రెస్ 16, NCP (SP) 10, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల విజయం సాధించాయి. ఒక సీటు సీపీఎంకు దక్కింది.
Also Read :- పాలమూరు జిల్లాలో భూ ప్రకంపనలు
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వెనకబాటుతో అసంతృప్తిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. కూటమితో దోస్తీని కట్ చేసుకునేందుకు నిర్ణయించుకుంది.మహారాష్ట్రలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించడం పట్ల కలత చెందిన సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబూ అసిమ్ అజ్మీ ఎన్నికలకు ముందు హర్యానాలో ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు.