
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ కు ఐపీఎల్ వేలానికి ముందు నిరాశ ఎదురైంది. ఐపీఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్న అర్జున్ కు ఈ నెల 20 నుంచి జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలో చోటు దక్కలేదు. ఈ టోర్నమెంట్ కోసం ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) బుధవారం తమ 22 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కోసం ముంబై సీనియర్ జట్టుకు ఎంపైకన 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ పేసర్ అర్జున్..అందులో ఆడిన రెండు మ్యాచుల్లో రాణించ లేకపోయాడు. రెండు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో చోటు దక్కలేదు.
see more news