
యూట్యూబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీలు ఇప్పుడు వెండితెరపై లక్ చెక్ చేసుకుంటున్నారు. ఇటీవల షార్ట్ఫిలింస్తో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య బేబీతో బ్లాక్ బస్టర్ కొట్టింది.లేటెస్ట్ గా మరో బుల్లితెర బ్యూటీ సిరి హనుమంతు( Siri Hanumanth) బంపర్ ఆఫర్ కొట్టేసింది.
అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటించిన జవాన్‌లో ఈ అమ్మడు మెరిసింది. ఇవాళ జవాన్ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఊహించని విధంగా సినిమాలో సిరిని చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. షారుక్ ఖాన్ సబార్డినేట్ పాత్రలో ఈ బిగ్‌బాస్ బ్యూటీ మెరిసింది. ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాలో చిన్న రోల్ చేసి పాపులర్ అయిన ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు సిరికి కూడా ఈ సినిమాతో ఆఫర్లు క్యూ కడతాయని అంటున్నారు.
జవాన్మూవీ మొదటి రోజు దాదాపు రూ.125కోట్లు సాధిస్తుందని ట్రెడ్ వర్గాల అంచనా. ఇండియాలో రూ.80కోట్లు సాధిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని పఠాన్ సినిమా రికార్డులను కొల్లగొడుతుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ అట్లీ తమిళ్ అయినా కూడా, జవాన్ లో సౌత్ వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సిరి హనుమంతుకు ఈ మూవీతో పాటు మరిన్ని అవకాశాలు కూడా వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.