
హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే టాలీవుడ్ సినీ సెలెబ్రెటీలపై కేసు నమోదు చేసి పోలీస్ ఎంక్వయీరీకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ భాషా స్పందించాడు.
ఇందులో భాగంగా చాలామంది బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక ప్రమోట్ చేశారని తెలిపాడు. అలాగే ఈ ప్రమోషన్స్ ఇప్పుడు చేసినవి కావని గతంలో ఎప్పుడో చేసినవని కానీ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఇప్పుడు ఆ వీడియోలని ప్రమోట్ చేసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన విష్ణు ప్రియ, టేస్టీ తేజ తదితరులకి ఎఫ్ఐఆర్ అంటే కూడా ఏంటో తెలియదని అలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సమయంలో వారికి టర్మ్స్ అండ్ కండీషన్స్ గురించి తెలియదని అందుకే ప్రమోట్ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఇప్పటికే తాను తాన్ బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ని కలిసి మాట్లాడానని త్వరలోనే ఎంక్వయిరీ జరిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపాడు.
ALSO READ | 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. 2 పెళ్లిళ్లు చేసుకుంది.. చివరికి అలా జరిగేసరికి..
అయితే గతంలో ఆర్జే శేఖర్ భాషా సంచలనం రేపిన రాజ్ తరుణ్- లావణ్య వ్యవహారంలో కీలక ఆధారాలు పోలీసులకి ఇచ్చాడు. అంతేకాదు మస్తాన్ సాయి వ్యవహారంలో కూడా రాజ్ తరుణ్ కి హెల్ప్ చేశాడు. దీంతో ఈమధ్య ఇండస్ట్రీలో ఎవరైనా అక్రమ కేసులలో ఇరుక్కుంటే శేఖర్ భాషా తగినంత సహాయం చేస్తున్నాడు.