లావణ్యకి డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలంటూ శేఖర్ భాషా సంచలనం..

లావణ్యకి డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలంటూ శేఖర్ భాషా సంచలనం..

తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా లావణ్య పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా తనకి లావణ్య నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. లావణ్య మస్తాన్ సాయిపై పెట్టిన కేసులపైకూడా స్పందిస్తూ ఆమెకి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరాడు. గతంలో కూడా రాజ్ తరుణ్ పై అనవసరంగా నిందలు వేస్తూ కేసులు, కేసులు, కోర్టులు అంటూ రచ్చ చేసిందని గుర్తు చేసుకున్నాడు. అలాగే లావణ్య కావాలనే మస్తాన్ సాయిని ఈ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తుందని కాబట్టి ఈ కేసుకుని మరింత క్షుణ్ణంగా విచారించాలని కోరాడు. దీంతో శేఖర్ భాషా లావణ్య పై చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

అయితే 3 రోజుల క్రితం మస్తాన్ సాయి అనే వ్యక్తిని హైదరాబాద్ లోని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లావణ్య మస్తాన్ సాయి అరెస్ట్ కి ముందు తనని నుంచి తీసుకున్న హార్డ్ డిస్క్ ని పోలీసులకు అందజేసింది. ఈ హార్డ్ డిస్క్ లో 200కి పైగా యువతుల అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తమ స్టైల్లో మస్తాన్ సాయిని వీడియోల గురించి విచారించగా యువతుల ఇష్టంతోనే ఈ వీడియోలు చిత్రీకరించినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసుని విచారిస్తున్నారు.