
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రుద్రంగి’. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, విమలా రామన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మొదటి పాటను శనివారం రిలీజ్ చేశారు. ఈ ఫోక్ సాంగ్‌లో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి ఆడి పాడింది. ‘పుట్టా మీద పాల పిట్ట.. జాజి మొగులాలి.. ముట్టబోతే తేలు కుట్టే జాజి మొగులాలి’ అంటూ రెలారే గంగ పాట నుంచి ఈ లిరిక్స్ సేకరించారు అభినయ శ్రీనివాస్. నాఫల్ రాజా ఏఐఎస్ ట్యూన్ కంపోజ్ చేయగా, మోహన భోగరాజు పాట పాడింది. భాను మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీలో దివి వేసిన స్టెప్స్ ఆకట్టుకున్నాయి.