
గజ్వేల్, వెలుగు : బిగ్బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ సోమవారం తన సొంత ప్రాంతం గజ్వేల్లో సందడి చేశారు. బిగ్బాస్ టైటిల్ను దక్కించుకున్న అనంతరం మొదటిసారి తన స్వగ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూర్కు వచ్చిన సందర్భంగా భారీగా రోడ్ షో నిర్వహించారు.
అభిమానులకు టైటిల్ప్రదర్శిస్తూ సందడి చేశారు. రాత్రి 7 గంటలకు అభినందన సభ నిర్వహించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. ప్రశాంత్ ను సత్కరించి, ఫోటోలు, సెల్పీలుదిగారు.