జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు పాక్ జవాన్లు, ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు.. శుక్రవారం ( ఫిబ్రవరి 7, 2025 ) ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పూంచ్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంబడి చొరబడేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్తాన్ చొరబాటుదారులను భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం.
ఫిబ్రవరి 4, 5 తేదీలలో అర్థరాత్రి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి చొరబడేందుకు ప్రయత్నించినవారిని గుర్తించి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారని.. వీరిలో ఇద్దరు నుండి ముగ్గురు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది ఉన్నారని భారత సైన్యం తెలిపింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | Viral Video: ఆహారం కోసం వచ్చిన ఏనుగును రెచ్చగొట్టారు.. ఇంకేముంది.. విధ్వంసమే..