హైదరాబాద్, వెలుగు: ఫోన్లను అమ్మే సంస్థ బిగ్ సీ తన 22 వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ఆఫర్లను ప్రకటించింది. తక్కువ టైమ్‌లోనే మొబైల్ ఫోన్లకు సంబంధించి ప్రతి రంగంలోనూ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని బిగ్ సీ ఫౌండర్ బాలు చౌదరి అన్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 5,999 విలువ గల స్మార్ట్‌వాచ్ లేదా రూ.1,799 విలువగల ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.22కే అందిస్తున్నామని తెలిపారు. 10 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్, జీరో డౌన్‌పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను ఇస్తున్నామని వివరించారు.
వివో, ఒప్పో,ఎంఐ, రియల్మీ, వన్‌ప్లస్ మొబైల్స్ కొన్నవారికి 10 శాతం ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తున్నామని బిగ్ సీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. శామ్సంగ్ మొబైల్స్ కొనుగోలుపై రూ.20 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్, ఐఫోన్ కొనుగోలుపై రూ.7 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్, బ్రాండెడ్ యాక్ససరీస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నామని తెలిపింది.