ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎలక్షన్ల తర్వాత అనూహ్యంగా 72 లక్షల మంది ఓటర్లు పెరిగారని ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చిందని రాహుల్ అన్నారు. ఎన్నికల ఫలితాల చట్టబద్దతను ప్రశ్నిస్తూ.. తొలగించిన ఓటర్లు, పెరిగిన అక్రమ ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన లోక్ సభ ఎణ్నికల తర్వాత హారాష్ట్ర ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు జరిగాయని ఆరోపించారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత 72 లక్షల మంది ఓటర్లను అక్రమంగా చేర్చారని చెప్పారు. మహారాష్ట్రలోని 118 స్థానాల్లో బీజేపీ 102 స్థానాల్లో గెలిచింది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని స్పష్టం తెలుస్తోందని రాహుల్ అన్నారు.
ALSO READ | జనగణనతో పాటే కులగణన.. సీఎం రేవంత్ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి నేతృత్వంలో ని మహాయుతి 230 సీట్లు గెలుచుకోవడంపై రాహుల్ అనేక సందేహాలను లేవనెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్వసనీయతపై ప్రశ్నిస్తూ.. బీజేపీ కి ఒంటరికి 132 సీట్లు రావడంపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు.
డిసెంబర్ ప్రారంభంలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో సవరణలో అవకతవకలు జరిగాయని.. ఎన్నికల అనంతరం ఓటింగ్ శాతం పెరగడంపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ ముందు ఆందోళన వ్యక్తం చేసింది.
మహారాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది ఓటర్లను తొలగించడాన్ని ప్రతినిధి బృందం హైలైట్ చేసింది. లోక్ సభ ఎన్నికల తర్వాత కొత్త 47 లక్షల మంది ఓటర్ల ను చేర్చగా.. ఎన్నికల సంఘం 39 లక్షలుగా రిపోర్టులో చూపించిందని తెలిపింది.
లోక్ సభ ఎలక్షన్ల తర్వాత అనూహ్యంగా ఓటర్లు పెరిగారని ఇది మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చిందని..ఎన్నికల ఫలితాల చట్టబద్దతను ప్రశ్నించారు కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.