పెద్ద దేశాలు.. సిద్ద దేశాలు అంటుంటారు.. అసలు పెద్ద దేశాలంటే ఏంటి?

పెద్ద దేశాలు.. సిద్ద దేశాలు అంటుంటారు.. అసలు పెద్ద దేశాలంటే ఏంటి?

పెద్ద దేశాలు..సిద్ద దేశాలు అంటుంటారు..అసలు పెద్ద దేశాలంటే ఏంటి? కొన్ని లెక్కలున్నయ్. డబ్బు ఎక్కువ ఉన్న దేశాలు. పవర్ ఎక్కువ ఉన్న దేశాలు, ఆర్మీ పవర్ బాగున్న దేశాలు, మేధావులు, ఆర్టిస్టులు ఎక్కువ ఉన్న దేశాలు..ఇట్ల రకరకాల లెక్కలు. ఇవేం కాకుండా..సైజులో పెద్ద దేశాల గురించి మాట్లాడుకుందాం. విచి త్రంగా ఈ పెద్ద సైజు దేశాల్లోని కొన్ని దేశాలే ఇవ్వాళ ప్రపంచాన్ని ఏలుతున్నయ్.

1. రష్యా

రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద సైజు దేశమ ని మనకు తెలుసు డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దీన్నుంచి ఒక డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లు తీసేసినా అప్పటికీ అది నెంబర్ వన్ గానే ఉంటుంది. అంటే ఎంత భూభాగమో ఆలోచించండి. ఇంత భూభాగం ఉన్నా జనాభా విషయంలో మనతో పోలిస్తే అటు ఇటుగా ఒక పదిశాతం అంతే! ఇంకొక విషయం ఏంటంటే.. ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్న భూభాగం కూడా ఈ దేశానిదే..

  • విస్తీర్ణం: 1.71 కోట్ల చదరపు కిలోమీటర్లు
  • భూభాగం: 90.79 %
  • నీళ్లు: 9.21%
  • జనాభా: 14.67కోట్లు
  • ఫారెస్ట్ ఏరియా: 747 లక్షల చదరపు కిలోమీటర్లు( 45.40%)

2. కెనడా

కెనడానుచాలామంది అమెరికాలో భాగం అనుకుంటారు. అయితే కెనడా దానికదే ఒక పెద్ద సైజు దేశం.99.84 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ దేశం. జనాభా మాత్రం చాలా అంటే చాలా తక్కువ. ఫారెస్ట్ ఏరియానే 31% ఉంది. ఇండియా మొత్తం విస్తీర్ణం కెనడాలోని అడవులతో సమానం. 

  • విస్తీర్ణం: 99.84 లక్షల చదరపు కిలోమీటర్లు
  • భూభాగం: 91.08% 
  • నీళ్లు:8.92%
  • జనాభా 3.71కోట్లు 
  • ఫారెస్ట్ ఏరియా: 31 లక్షల చదరపు కిలోమీటర్లు (31.06%)

3.యూఎస్ఎ

డబ్బు, పవర్ విషయంలోనే కాక విస్తీర్ణం విషయంలో కూడా అమెరికా పెద్ద దేశమే. ఎక్కువ విస్తీర్ణం ఉన్న దేశాల్లో యూఎస్ఎ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా 30% అడవులున్నాయి. ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో కూడా ముందు వరుసలోనే (మూడో స్థానం) ఉంది.

  • విస్తర్ణం: 96.3 లక్షలచదరపు కిలోమీటర్లు
  • భూభాగం: 93.24%
  • జనాభా: 32.72 కోట్లు
  • ఫారెస్ట్ ఏరియా:30.30 లక్షలచదరపు కిలోమీటర్లు (30.84%)

4.చైనా 

చైనా అనగానే 'ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నదేశం' అన్న మాటే గుర్తొస్తుంది. అమెరికా-చైనా మధ్య విస్తీర్ణంలో తేడా 30 వేల చదరపు అడుగులే. అయితే జనాభా మాత్రం చాలా ఎక్కువ. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. చైనా భూభాగంలో అడవులు చాలా తక్కువ. మొత్తం భూభాగంలో అడవులు 18 శాతమే.

  • విస్తీర్ణం: 96 లక్షల చదరపు కిలోమీటర్లు.
  • భూభాగం: 97.2% 
  • నీళ్లు:2.8% 138.64 
  • ఫారెస్ట్ ఏరియా:  18 లక్షలచదరపు కిలోమీటర్లు (18.21%)

5.బ్రెజిల్

బ్రెజిల్ అంటే మనకు ముందు ఫుట్ బాల్ ఆట గుర్తోస్తుంది. ఫుట్బాల్ ఆట గుర్తొస్తుంది. మనదేశంలో క్రికెట్గా అక్కడ ఫుట్ బాల్.విస్తీర్ణంలో బ్రెజిల్ ఐదో పెద్ద దేశం. బ్రెజిల్ కల్చర్ కూడా ప్రపంచమంతటా ఫేమస్. ఈ భూభాగంలో సగానికి పైగా అడవులే ఉంటాయంటే, బ్రెజిల్ ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోండి. 

  • విస్తీర్ణం: 85.1లక్షల చదరపు కిలోమీటర్లు
  • భూభాగం: 99.34%
  • నీళ్లు:  :0.66% 
  • ఫారెస్ట్ ఏరియా:  47 లక్షలచదరపు కిలోమీటర్లు (56.10%)

6.ఆస్ట్రేలియా 

చుట్టూ నీళ్లుండే అతిపెద్ద ద్వీపం ఆస్ట్రేలియా. కానీ, చుట్టూరా ఇంత భూభాగం ఉంది. కాబట్టే దీన్ని ద్వీపంగా లెక్కలోకి తీసుకోవడం లేదు. 76 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఆస్ట్రేలియాలో అడవులున్నది మాత్రం 19 శాతమే. అయితే జనాభా మాత్రం చాలా తక్కువ.

  • విస్తీర్ణం: 76.9 లక్షలచదరపు కిలోమీటర్లు
  • భూభాగం: 99%
  • నీళ్లు: 1%
  • జనాభా: 2.465
  • ఫారెస్ట్ ఏరియా: 14,70 లక్షల చదరపు కిలోమీటర్లు (199%)
  • భూమి ఎంత పెద్దది?
  • భూమి విస్తీర్ణం: 51 కోట్ల చదరపు కిలోమీటర్లు
  • అందులో భూభాగం : 14.8 కోట్ల చదరపు కిలోమీటర్లు
  • నీళ్లు (అంటే సముద్రాలు, నదులు కలిపి, ఇందులో సముద్రాలే
  • 97.5 శాతం): 36.13 కోట్ల చదరపు కిలోమీటర్లు.