న్యూ ఇయర్ వేడుకలో మహిళలతో సెల్ఫీకి బలవంతం.. ఇద్దరు అరెస్ట్

న్యూ ఇయర్ వేడుకలో మహిళలతో సెల్ఫీకి బలవంతం.. ఇద్దరు అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో కొత్త సంవత్సర వేడుకలో పెద్ద గొడవ జరిగింది. సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంసోనే కొందరు వ్యక్తులు మహిళలతో సెల్ఫీలు దిగేందుకు కోసం బలవంతం చేశారు. దీంతో ఆ మహిళకు చెందిన వారికి, ఆ వ్యక్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గౌర్ సిటీ ఫస్ట్ అవెన్యూ సొసైటీలో నిన్న రాత్రి జరిగిన కొత్త సంవత్సర వేడుకలో ఇద్దరు మహిళలతో సెల్ఫీలు దిగేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారని, దీంతో వారి భర్తలకు, నిందితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం నిందితులిద్దర్ని కొట్టారని, స్థానికులు, సెక్యూరిటీ గార్డులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో వారు కూడా గాయపడ్డారని అధికారులు చెప్పారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని స్పష్టం చేశారు. సొసైటీకి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, తన స్నేహితుడి భార్యతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారన్నారన్నారు. దీనికి వారు అభ్యంతరం చెప్పడంతో ఆ వ్యక్తులు అతడిని, అతని స్నేహితుడు రితేష్‌ను కొట్టారని తెలిపారు. ఇంతలో స్థానికులు జోక్యం చేసుకుని రక్షించడానికి ప్రయత్నించగా.. ఆ క్రమంలో మరికొందరు గాయపడ్డారని కుమార్ చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కూడా స్పష్టం చేశారు.