పెద్ద ఇంటిని రెండుగా విభజించాలంటే.. వాస్తు నియమాలు ఇవే..

పెద్ద ఇంటిని రెండుగా విభజించాలంటే.. వాస్తు నియమాలు ఇవే..

పూర్వకాలంలో చాలా పెద్ద పెద్ద ఇళ్లు ఉండేవి.  అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందుకే ఎంత పెద్ద ఇల్లయినా ఇరుకుగా అనిపించేది.  కాని ఈ ఆధునిక కాలంలో సింగిల్​ ఫ్యామిలీస్​ కావడంతో అంతపెద్ద ఇల్లు అవసరం ఉండదు.  పూర్వం ఉన్న పెద్ద ఇంటిని రెండు భాగాలుగా చేసి ఒక పోర్షన్​ ను రెంట్​ కు ఇవ్వాలనుకునే వారు కొన్ని వాస్తు సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం. . . .

పూర్వ కాలంలో ఇళ్లు చాలా పెద్దవిగా ఉండేవి.  అప్పుడు పార్టిషన్​ చేయాల్సివచ్చినప్పుడు మధ్యలో కర్టెన్​ పెట్టుకొని రెండు భాగాలుగా వాడుకొనేవారు. కాని ఇప్పుడు అలా కుదిరే రోజులు కాదు కదా.. అలాంటి సమయంలో ఆ ఇంటిని రెండు భాగాలుగా చేసుకోవచ్చు.  అవసరమైతే ఒక పోర్షన్​ ను రెంట్​ కు కూడా ఇవ్వవచ్చు.  అయితే అలా రెండు భాగాలుగా విడగొట్టేటప్పుడు  ఫేసింగ్ బట్టి వాస్తు ఉండాలి. దర్వాజ పడమర వైపు ఉంటే నైరుతి కలిసిరాదు. ఇంటిని రెండు భాగాలుగా విడగొడితే.. తూర్పు వైపు ఓనర్స్ ఉండి, పడమరవైపు...  భాగాన్ని కిరాయికి ఇవ్వొచ్చు. లేదంటే. ఉత్తరం వైపు ఉండి, దక్షిణం దిక్కును కిరాయికి ఇవ్వొచ్చు.

 
ఇక వంటగది విషయానికి వస్తే  సింక్ ఈశాన్యంలో, పొయ్యి తూర్పు ముఖం వైపు, సామాన్లు దక్షిణ, పడమర వైపు ఉండాలి. బరువైన వస్తువులు కిచెన్ లో పెట్టుకోవచ్చు. అయితే నైరుతిలో మాత్రమే  బరువైన వస్తువులు ఉండాలి. చాలామంది ఇంటిని అంతా వాస్తు ప్రకారం  కట్టుకుంటారు.  కాని మెట్లను నిర్మించేటప్పుడు చిన్న విషయమే కదా అని అశ్రద్ద చేస్తారు.  కాని మెట్లు వాస్తు ప్రకారం ఉండకపోతే ఆఇంటిలో ఉండే వారికి.. అలాగే ఇంటి ఓనర్స్​ కు  చాలా ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.  ప్రస్తుతం ఒకటే ఫ్లోర్​ ఉండి.. భవిష్యత్తులో మరో ఫ్లోర్​ కట్టుకోవాలనుకుంటే ... ఇంటికి నైరుతి భాగంలో మెట్లను నిర్మించుకోవాలి.  ఒక్కొక్కసారి అలా అవకాశం ఉండదు,  అలాంటప్పుడు  వాయువ్యంలోకాని.. ఆగ్నేయంలో కాని మెట్లను నిర్మించుకోవచ్చు.  అయితే నైరుతి మూలలో  ( వాటర్​ ట్యాంక్​) మాత్రం బరువైన వస్తువులు ఉండాలి.  లేదంటే ఆ దిశలో ఎత్తైన గోడ కూడా కట్టాలి. .

వాస్తు గురించి తెలియనివాళ్లు అద్దాలు ఉండొద్దని చెప్తుంటారు. బాత్రూమ్ లో అద్దాలు ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు రావు. ప్రతి బాత్రూంలో అద్దం పెట్టుకోవచ్చు. ఇది ఎన్నో ఏళ్లుగా ఉంది. పైగా అద్దాలు ఉండటం వల్ల బాత్రూంకు లుక్ వస్తుంది.. అయితే పగిలిన అద్దాలు ఉంటే వాటిని వెంటనే మార్చేయాలని వాస్తు  నిపుణులు  కాశీనాథుని శ్రీనివాస్​ తెలిపారు.  ఇంకా ఇంటి వాస్తుకు సంబంధించి ఎలాంటి అనుమాలున్నా.. లేదా  ఉన్న ఇంటిని తీసేసి కొత్త లుక్​ వచ్చే విధంగా కొత్త మోడల్​లో ఇల్లు నిర్మించాలనుకునేవారు వాస్తు కోసం  శ్రీనివాస్ ( 9440088799) ను సంప్రదించాలి.