న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ మెంబర్లకు శుభవార్త! పీఎఫ్ డబ్బులను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే కొత్త ఫెసిలిటీని వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకొస్తామని లేబర్ సెక్రెటరీ సుమితా దావ్రా పేర్కొన్నారు. బెటర్ సర్వీస్‌లను అందించేందుకు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ‘క్లెయిమ్స్‌ను వేగంగా సెటిల్ చేస్తున్నాం. ప్రాసెస్ మరింత ఈజీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఏటీఎం ద్వారా పీఎఫ్ క్లెయిమ్స్‌ను పూర్తి చేయొచ్చు’ అని వివరించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓలో 7 కోట్ల యాక్టివ్ మెంబర్లు ఉన్నారు.
సిస్టమ్స్ ప్రతీ రెండు మూడు నెలలకు మెరుగవుతున్నాయని, వచ్చే ఏడాది జనవరి నాటికి పెద్ద మార్పులు కనిపిస్తాయని సుమితా అన్నారు. ఈపీఎఫ్‌ఓ సర్వీస్‌లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. గిగ్ వర్కర్లకు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందించేందుకు స్కీమ్ తీసుకొస్తామన్నారు.