నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

హైదరాబాద్: విద్యుత్ శాఖ నుంచి త్వరలో భారీ  నోటిఫికేషన్ రాబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం కలెక్టరేట్‎లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని ప్రకటించారు. విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చామని వివరించారు.  ఎక్కడ కూడా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు వేలాడి ఉండకూదన్నారు. అధికారులు సీరియస్‎గా తీసుకుని మరమ్మతులు చేపట్టాలని సూచించారు. 

ALSO READ | వచ్చి.. మీ ప్రభుత్వ ఉద్యోగం అపాయిమెంట్స్ తీసుకోండి: డీఎస్సీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్‎కు ఫోన్ కాల్

ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంధన శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త స్కీమ్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. కరెంట్ ట్రిప్ కాకుండా అవసరం మేరకు ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ సమస్యలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నదని, దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.