దీపావళి ధమాకా తగ్గిన విమాన టికెట్ ధరలు

దీపావళి ధమాకా తగ్గిన విమాన టికెట్ ధరలు
  • కిందటేడాదితో పోలిస్తే సగటున  20–25 శాతం తగ్గుదల
  • కెపాసిటీ పెరగడం,  క్రూడాయిల్ ధరలు దిగిరావడమే కారణం
  • 32 శాతం తగ్గిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఢిల్లీ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధరలు:  ఇగ్జిగో

న్యూఢిల్లీ: దీపావళి టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రయాణించాలనుకునే వారికి ఊరట లభించింది. విమాన టికెట్ రేట్లు భారీగా తగ్గాయి.  కిందటేడాదితో పోలిస్తే  టికెట్ ధరలు సగటున 20–25 శాతం తగ్గాయని ట్రావెల్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ ఇగ్జిగో రిపోర్ట్ పేర్కొంది.  కొన్ని రూట్లలో 38 శాతం వరకు కూడా ధరలు తగ్గాయి. విమానాల్లో ప్రయాణించేవారు పెరగడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో కంపెనీలు టికెట్  రేట్లను తగ్గించాయి. నెల రోజుల ముందు చేసుకునే  వన్ వే విమాన టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలను  ఇగ్జిగో పరిగణనలోకి తీసుకుంది. ఈ రిపోర్ట్ ప్రకారం,  బెంగళూరు–కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిందటేడాది పండుగ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టికెట్ ధర సగటున రూ.10,195 ఉంటే, ఈ ఏడాది రూ.6,319 కి తగ్గింది. 

ఇది 38 శాతం తక్కువ. చెన్నై–కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా  రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వన్ వే టికెట్ ధర  36 శాతం పడి సగటున రూ.8,725 నుంచి రూ.5,604 కి దిగొచ్చింది. ముంబై– ఢిల్లీ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టికెట్ రేటు 34 శాతం పడి రూ.8,788 నుంచి రూ.5,762 కి, ఢిల్లీ–ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టికెట్ ధర రూ.11,296  నుంచి రూ.7,469 కి పడ్డాయి.  అలానే ఢిల్లీ–కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఢిల్లీ, ఢిల్లీ–శ్రీనగర్ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో విమాన టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలు కూడా 32 శాతం వరకు దిగొచ్చాయి. 

టికెట్ ధరలు తగ్గడానికి ఇదే కారణం..

కిందటేడాది పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలయ్యే  నాటికి గో ఫస్ట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆగిపోయాయని, దీంతో కెపాసిటీ తక్కువగా ఉందని ఇగ్జిగో గ్రూప్ సీఈఓ  అలోక్ బజ్పాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. విమాన సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తగ్గడంతో  టికెట్ రేట్లు భారీగా పెరిగాయని చెప్పారు.  కానీ, ఈ ఏడాది  కెపాసిటీ పెరిగిందని, ఫలితంగా కిందటేడాదితో పోలిస్తే  రేట్లు 20 శాతం నుంచి 25 శాతం మేర పడ్డాయని  వివరించారు. 

అలానే కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే క్రూడాయిల్ ధరలు 15 శాతం మేర తగ్గడం కూడా కలిసొచ్చిందని అన్నారు. మరోవైపు కొన్ని రూట్లలో  విమాన టికెట్ ధరలు పెరిగాయి కూడా. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఢిల్లీ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వే టికెట్ ధర  34 శాతం ఎగిసింది. సగటున  రూ.6,533  నుంచి రూ.8,758 కి చేరుకుంది. ముంబై– డెహ్రాడూన్ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ 11,710 నుంచి రూ.15,527 కి  పెరిగింది. 

పెరిగిన విమాన ప్రయాణాలు..

విమానాల్లో ప్రయాణించే వారు పెరుగుతున్నారు. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  కిందటి నెలలో 1.32 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు.  కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 8 శాతం గ్రోత్ నమోదయ్యింది. ఇక్రా రిపోర్ట్ ప్రకారం,  కరోనా ముందు స్థాయి (2019, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తో  పోలిస్తే డొమెస్టిక్   ఎయిర్ ట్రాఫిక్ 15 శాతం ఎక్కువగా ఉంది.   అదే ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమాన ప్రయాణికుల సంఖ్య కేవలం 0.8 శాతమే వృద్ధి చెందింది. ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ నిలకడగా ఉందని ఇక్రా అంచనా వేస్తోంది.

కానీ, క్రూడాయిల్ ధరలు గరిష్టాల్లో కొనసాగితే కంపెనీలకు  నష్టాలు తప్పవని పేర్కొంది. అలానే సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలు, ఇంజిన్ ఫెయిల్యూర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విమానాల మెయింటెనన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇబ్బందిపెడుతున్నాయని పేర్కొంది. 
మరోవైపు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసేవారి సంఖ్య కూడా నిలకడగా పెరుగుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలతో పోలిస్తే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగింది