హైదరాబాద్: ఆలిండియా సర్వీసుల్లో (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్) వికలాంగుల కోటా అవసరమా అంటూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వికలాంగులపై స్మితా సబర్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. అత్యున్నత పదవిలో ఉండి స్మితా సబర్వాల్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు, మేధావులు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Also Read:-పంట నష్టపోయిన రైతులకు బిగ్ రిలీఫ్
చివరకు స్మితా చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు హైకోర్టు వరకు చేరాయి. వికలాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టిన హైకోర్టు.. స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో దివ్యాంగులపై కాంట్రవర్సీ కామెంట్స్ ఇష్యూలో స్మితాకు భారీ ఊరట దక్కింది.