ఏపీ హైకోర్టులో పోసానికి ఊరట..తొందరపాటు చర్యలొద్దంటూ ఆదేశాలు..

ఏపీ హైకోర్టులో పోసానికి ఊరట..తొందరపాటు చర్యలొద్దంటూ ఆదేశాలు..

అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో పోసానిపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.ఆయా జిల్లాలో తనపై నమోదైన కేసులు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం ( మార్చి 6, 2025 ) విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు ఆదేశాలిచ్చింది.  

పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల మేరకు పోసానిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పోసానిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు.

Also Read : కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ

రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై పీటీ వారెంట్లు జారీ అవ్వడంతో పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి గుంటూరు, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద తరలించారు పోలీసులు.