ఢిల్లీ: సద్గురు జగ్గీ వాసుదేవ్కు చెందిన ఈషా ఫౌండేషన్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తన ఇద్దరు కూతుర్లను సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో బలవంతంగా బంధించారని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆ ఇద్దరు మహిళలు తాము స్వచ్ఛందంగానే ఆశ్రమంలో ఉంటున్నామని ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలించిన ధర్మాసనం ఈ కేసును కొట్టేసింది.
ALSO READ | 18 నెలలుగా జైళ్లో ఉన్న ఆప్ నేతకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
సుప్రీం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. తన ఇద్దరు కూతుర్లను సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్లో బలవంతంగా బంధించారని.. వారిని తిరిగి తమకు అప్పగించాలనేది పిటిషనర్ వాదన. ఈ సంస్థ వ్యక్తులను బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తూ వారి కుటుంబాలతో సంబంధాలను తెంచేస్తోందని పిటిషనర్ చెప్పుకొచ్చారు. కామరాజ్ ఇద్దరు కూతుర్లు ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని.. తమను ఎవరూ నిర్భందించలేదని తెలిపారు.