ఎస్బీఐ బ్యాంకులో భారీ స్కాం.. రూ. 2.80 కోట్లతో ఉడాయించిన మేనేజర్

రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. నమ్మి తమ సొమ్మను, వివరాలను ఇస్తే బ్యాంక్ మేనేజర్లు కోట్లు కొల్లగొట్టారు. ఖాతాదారులకు తెలియకుండా రూ.2.80 కోట్లు కాజేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ రామంతపూర్ లోని ఎస్బీఐ మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్య బ్యాంకులో లోన్ అప్లై చేసిన కస్టమర్ల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని ఫామ్ 16ను ఫోర్జరీ చేసి తప్పుడు స్టేట్‌మెంట్లతో లోన్లు తీసుకున్నారు. లోన్ అమౌంట్‌ను భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకుని ఉడాయించారు. 

Also read : క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా..? ఇక్కడ ఫ్రీగా చెక్ చేసుకోండి... 

ఫోర్జరీ డాక్యుమెంట్లతో 19 మంది పేర్లపై రూ.2.80 కోట్ల లోన్లు తీసుకుని మోసం చేశారు. బ్రాంచికి కొత్త మేనేజర్ రావడంతో మోసం బయటపడింది. మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాం బయటపడిందని గ్రహించిన  షేక్ సైదులు, భార్య సుష్మ, కొడుకు పీరయ్య, మరో మేనేజర్ గంగమల్లయ్య పరారయ్యారు. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోట్ల రూపాయలు తమ పేర్ల మీద లోన్లు తీసుకోవడంతో బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.