సంక్రాంతి సినిమాలకు షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. టికెట్ రేట్ల పెంపుపై.. దాఖలైన పిటీషన్లపై విచారణ చేసిన కోర్టు.. టికెట్ రేట్ల పెంపుపై కొన్ని సూచనలు చేసింది. 14 రోజులు టికెట్ రేట్లు వద్దని.. కేవలం 10 రోజులు మాత్రమే ధరలు పెంచుకోవాలని నిర్మాతలకు సూచించింది.
2025 సంక్రాంతి పండక్కి వస్తున్న రాం చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకూ మహరాజ్ సినిమాలకు.. టికెట్ రేట్ల పెంపుకు అవకాశం కల్పిస్తూ.. ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. విచారణలో హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఇకపోతే ముందుగా జనవరి 10 నుంచి జనవరి 23 వరకు ఐదు షోలు, రేట్లు పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
టికెట్ ధరలు:
గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించింది. మిగిలిన షోలకు మల్టీఫ్లెక్స్ లలో రూ.175(జీఎస్టీతో కలిపి), సింగిల్ స్క్రీన్ లో రూ.135 (జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాపంగా రిలీజ్ కానుంది.
డాకు మహారాజ్ (Daaku Maharaj) ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాపంగా రిలీజ్ కానుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. డాకు మహారాజ్ ఏపీలో టికెట్ల రేట్ చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్ లో రూ.110, మల్టీప్లెక్స్ అయితే రూ.135 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.