హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనోజ్, మోహన్ బాబు గొడవల సమయంలో జర్నలిస్ట్పై మోహన్ బాబు దాడి చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది న్యాయ స్థానాన్ని అభ్యర్థించారు. అయితే.. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి(డిసెంబర్ 23, 2024) వాయిదా వేసింది.
జర్నలిస్ట్పై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వాళ్లు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో మంచు విష్ణు, మంచు మనోజ్‌ను విచారించినట్లు చెప్పారు.
అసలు ఆరోజు ఏం జరిగిందంటే..
సినిమా నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు దాడి, ప్రతిదాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. మోహన్‌బాబుకు మద్దతుగా పెద్దకొడుకు మంచు విష్ణు ఫామ్‌హౌస్‌కు చేరుకున్న వెంటనే పరిస్థితి మరింత హీటెక్కింది. విష్ణు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే మోహన్‌బాబు రిసీవ్ చేసుకుని నేరుగా జల్‌పల్లిలోని ఫామ్‌హౌస్ కమ్ఇంటికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మనోజ్, ఆయన భార్య మౌనిక అక్కడ ఉన్నారు. విష్ణు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మోహన్‌బాబు అనుచరులు, బౌన్సర్లు ఓ వైపు.. మంచు మనోజ్ బౌన్సర్లు మరోవైపు పోటాపోటీగా ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
ALSO READ | RRR : Behind and Beyond: Dec 20న థియేటర్లో ఆర్‌ఆర్‌ఆర్ డాక్యుమెంటరీ.. టికెట్ ధర ఎలా ఉందంటే?
అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించారు. అనుచరులు బయటికి వచ్చిన కొద్దిసేపటికి మనోజ్, మౌనిక దంపతులు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. గేట్ వద్ద మీడియాతో మనోజ్మాట్లాడారు. ‘‘నేను ఆస్తుల కోసమో డబ్బు కోసమో ఆశపడడంలేదు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నా. నా భార్యపై మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నాకు జరిగిన అన్యాయం పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. న్యాయం జరిగే వరకు పోరాడుతాను” అని మనోజ్ అన్నారు. అనంతరం మళ్లీ ఇంట్లోకి వెళ్లారు.
ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు రెచ్చిపోయారు. చేతుల్లోంచి మైకులను గుంజుకొని.. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అక్కడే ఆందోళనకు దిగారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలతో ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్‌బాబు, విష్ణు గన్స్‌ను రాచకొండ పోలీసులు సీజ్ చేశారు.