బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్

పార్లమెంట్ ఎన్నికల దగ్గరకొస్తున్న వేళ బీజేపీ పార్టీ బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

2021లో బీజేపీలో చేరి 2023లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఆశించిన కూన శ్రీశైలంకు పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణ పై మీటింగ్ నిర్వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ALSO READ :- మూడేళ్ల కింద పెద్దపులి..ఇపుడు ఏనుగు