- కాంగ్రెస్‌లోకి 400 మంది కార్యకర్తలు
వీణవంక, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని బస చేశారు. అనంతరం ఆదివారం వీణవంక ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఇదే టైంలో మండల కేంద్రంతో పాటు చల్లూరు గ్రామం నుంచి సుమారు 400 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో చల్లూరులో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌లో చేరారు.