ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణి, వైస్ ఎంపీపీ సుచందర్ బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. పార్టీ ప్రారంభం నుండి కేసీఅర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశామని లేఖలో పేర్కొన్నారు.
పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల సేవలు చేశామని.. కానీ పార్టీ మాత్రం మమ్ముల్ని అణిచివేతకు గురి చేసి చిన్న చూపు చూసిందని ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం ఎంతో కృషి చేశామని .. ఆయన కూడా మమల్ని చిన్న చూపు చూసినట్లు అనిపించిందన్నారు.
ప్రజల కోరిక మేరకు, తమ కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖలో తెలిపారు. రాజీనామా లేఖలను కేసీఆర్ కు పంపించారు.