
పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సుల్తానాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చెందర్ రావు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యవహారశీలి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మనోహర్ రెడ్డిని పెద్దపెల్లి నియోజకవర్గం పార్టీ బాధ్యతల నుంచి తొలగించాలన్నారు. ఎంపీగా పోటీ చేసే కొప్పుల ఈశ్వర్ కు మండల స్థాయి నాయకులు కూడా తెలియదని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ కు నియోజకవర్గంలో ఎంత మంది నాయకులు తెలుసునని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా మనోహర్ రెడ్డి తన సొంత లాభం కోసం పెద్దపెల్లి నియోజకవర్గాన్ని పనంగా పెట్టారన్నారు. మనోహర్ రెడ్డి కార్యకర్తలను, నాయకులను వాడుకొని వదిలేసే రకమని చెప్పారు.