ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్

ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్

ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన పిటీషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ పిటీషన్ పై.. 2024, సెప్టెంబర్ 20వ తేదీ విచారణ చేసిన న్యాయస్థానం.. సీఎం ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమే అని.. ఆధారాలు లేకుండా ఎలా చెబుతారంటూ వ్యా్ఖ్యానించింది కోర్టు. ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోలేం అంటూ జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.

ఇదే సమయంలో కేసు విచారణ చేస్తున్న ఏసీబీకి కొన్ని సూచనలు చేసింది సుప్రీంకోర్టు. విచారణకు సంబంధించిన ఏ అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయొద్దని ఆదేశించింది. కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఆదేశించింది సుప్రీంకోర్టు. 

సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలన్న బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ను సైతం నిరాకరించింది సుప్రీంకోర్టు. భవిష్యత్ లో.. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే.. అప్పుడు పిటీషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. 

ALSO READ : ఐక్యంగా ముందుకెళ్దాం .. మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు

కేసు విచారణ సమయంలో జోక్యం చేసుకోలేం అని.. మరో రాష్ట్రంలో ఈ కేసు విచారణ అవసరం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. విచారణ ముగిసినట్లు స్పష్టం చేసింది.