బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కు షాక్ తప్పేలా లేదు. పటౌడీ కుటుంబానికి చెందిన 15 వేల కోట్ల రూపాయల ఆసస్తులను ప్రభుత్వం స్వాధీనం చేససుకునే అవకాశం కనిపిస్తోంది. పటౌడీ ఫ్యామిలీకి చెందిన ఆస్తులపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పటి వరకు ఉన్న స్టే ఎత్తేయడమే అందుకు కారణం. ఎనిమీ ప్రాపర్టీ-1968 చట్టం కింద ఆస్తులను స్వాధీనం చేససుకోనుంది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్ కు వలస వెళ్లిన వ్యక్తులకు చెందిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.
మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణలో భాగంగా 2024 డిసెంబర్ 13న అప్పీలేట్ అథారిటీ ముందు తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది. 21 జనవరి 2025తో గడువు ముగుస్తున్నప్పటికీ పటౌడీ ఫ్యామిలీ హాజరు కాలేదు. దీంతో పటౌడీ ఆస్తులను స్వాధీనం చేసుకొమ్మని కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
కేసు ఏంటి?
ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్ 2015లో భోపాల్ నవాబుకు చెందిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా పేర్కొంది. దీనిపై పటౌడీ ఫ్యామిలీ కోర్టు ను ఆశ్రయించింది. ఈ కేసులో పటౌడీ కుటుంబం నుంచి సైఫ్ అలీఖాన్, తల్లి శర్మిలా ఠాగూర్, సిస్టర్స్ సోహా అలీఖాన్, సబా అలీఖాన్ లతో పాటు మన్సూర్ అలీఖన్ సోదరి సబిహా సుల్తాన్ హాజరయ్యారు.
భోపాల్, రెయిజెన్ లో ఉన్న భూమితో పాటు నూర్ ఇ సభా, ఫ్లాగ్ హౌజ్, దార్ ఉస్ సలామ్, ఫార్స్ ఖానా, కొహెఫిజా, అహ్మదాబాద్ ప్యాలస్ మొదలైన ఆస్తులు తమ కుటుంబానికి చెందుతాయని వాదించారు.
1947లో భోపాల్ ప్రిన్స్ లీ స్టేట్ గా ఉండేది. మన్సూర్ అలీఖాన్ ముత్తాత అయిన హమీదుల్లా ఖాన్ చివరి నవాబ్ గా పాలించాడు. నవాబ్ హమీదుల్లా ఖాన్ కు ఉన్న ముగ్గురు కూతుళ్లలో పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ కు వలస వెళ్లింది.
ALSO READ : ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత..సైఫ్‌అలీఖాన్ డిశ్చార్జ్
రెండో కూతురు సాజిదా సుల్తాన్ ఇండియాలోనే ఉండిపోయింది. నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీని వివాహం చేసుకుంది. వీరి మనుమడే సైఫ్ అలీఖాన్.
అయితే ఈ ప్రాపర్టీలకు సాజిదా సుల్తాన్ వారసురాలిగా, ఆమె వారసుడిగా సైఫ్ అలీఖాన్ కోర్టు 2019లో గుర్తించింది. కానీ అబిదా షసుల్తాన్ పాకిస్తాన్ కు వలసవెల్లడంతో వాటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించాలని సంస్థలు అంటుంటే.. ఆ ఆస్తులకు కూడా వారసలం తామేనని, ప్రభుత్వం స్వాధీనం చేససుకోడానికి వీళ్లేదని వాదిస్తున్నారు. తాజాగా కోర్టు స్టే ఎత్తేయడంతో ప్రభుత్వం స్వాధీనం చేససుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.