ఒక పక్క సోషల్ మీడియా కార్యకర్తలు, నేతల వరుస అరెస్టులతో సతమతం అవుతున్న వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏరి కోరి తెచ్చుకొని ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన జయమంగళం వెంకటరమణ పార్టీతో పాటు మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతే కాకుండా మరికొంతమంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషెన్‌రాజుకు పంపారు వెంకటరమణ. 2009లో టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు వెంకటరమణ. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరిన వెంకటరమణకు ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ALSO READ | కర్నాటక, ఏపీ ప్రాజెక్టులను ఆపండి .. తుంగభద్ర బోర్డును కోరిన తెలంగాణ
వెంకటరమణ జనసేన వైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు స్థానిక కూటమి నేతలు ఆయనతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రాజినామా సమర్పించిన వైసీపీ ఎమ్మెల్సీల విషయంలో చైర్మెన్ ఏ నిర్ణయం తీసుకోలేదు.ఈ క్రమంలో మరికొంతమంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడునున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశం అయ్యింది.