ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa The Rule).క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది. అల్లు అర్జున్ స్వాగ్, స్టైల్, ఆ భీకరమైన నడక ఇవన్నీ టీజర్ కే హైలెట్ గా ఉన్నాయి.
అల్లు అర్జున్ గంగమ్మజాతరతో ఇండియా వైడ్ గా బాగా పాపులర్ అయింది. అల్లు అర్జున్ మహాశక్తి అవతారం నిజంగానే తనలో పూనిన ఫీలింగ్ కళ్ళకు కనిపించింది. అల్లు అర్జున్ పట్టుచీర కట్టుకొని..ముఖానికి కలగలిపిన రంగులతో..మెరిసే ఆభరణాలు, కాళ్ల గజ్జలు, మెడలో దండలతో అమ్మవారి అవతారంలో అదరగొట్టేశాడు. అయితే..తాజా సమాచారం ప్రకారం ఇందులో అల్లు అర్జున్ ధరించిన చీరపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
అల్లు అర్జున్ కట్టుకున్న చీర..అల్లు అర్జున్ అమ్మదట.ఈ సెంటిమెంట్ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుందనే నిర్ణయంతో డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్ చాలా హైలైట్ గా ఉండబోతుందని ఇప్పటికే అభిమానుల సైతం భావిస్తున్నారు. అంతేకాదు ఈ సన్నివేశం ఇంటర్వెల్ సీన్ కు ముందు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చిత్రం కోసం పాన్ ఇండియా లెవెల్లో కాదు పాన్ వరల్డ్ స్థాయిలో హైప్ పెరుగుతుంది.
మొత్తానికి ఈ జాతర సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ తో కట్ చేసిన టీజర్ మాత్రం ఆద్యంతం పూనకాలు తెప్పించింది. టీజర్ లో విలన్ ను కాలితో తన్ని అదే కాలితో చీర కొంగుని తీసుకొని నడుములో చెక్కుకునే సీన్ అయితే మాస్.. ఊర మాస్ అనే రేంజ్ లో ఉంది. చివర్లో అల్లు అర్జున్..హుప్ అని వింత సౌండ్ తో అరవగానే అందరూ భయపడి వెనక్కి వెళ్లే షాట్ అదిరిపోయింది. దేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.