ఐదు రోజుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: కశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు పంజా విసుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లలో టెర్రిస్టులను మట్టబెడుతున్నాయి. తాజాగా పుల్వామాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. ఈ విషయాన్ని కశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. వారిలో ఒకరిని పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి నుంచి రెండు ఎం4 కార్బైన్లతోపాటు ఒక ఏకే సిరీస్ రైఫిల్ సహా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇది పెద్ద విజయమన్నారు. కొత్త ఏడాదిలో గడిచిన ఐదు రోజుల్లో 8 మంది టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టడం గమనార్హం. 

కాగా, మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని విజయ్ కుమార్ తెలిపారు. హత్యకు గురైన ఇద్దరు కూడా స్థానికులని ఎల్‌ఇటికి అనుబంధంగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తల కోసం: 

భారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు

అక్కడ చాలామంది పని రాక్షసులే

గాంధీ ఫోటోపై భువనగిరి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు