ఏఐ చాట్​బోట్ ​విభాగంలోకి  మస్క్​, జుకర్​ బర్గ్​!

ఏఐ చాట్​బోట్ ​విభాగంలోకి  మస్క్​, జుకర్​ బర్గ్​!

వాషింగ్టన్​ : ఆర్టిఫీషియల్​ఇంటెలిజెన్స్(ఏఐ)​ చాట్ బోట్​ విభాగంపై బడా టెక్​ కంపెనీలు కన్నేశాయి. ఏ రంగంలోకి అడుగుపెట్టినా సంచలనం సృష్టించే బిలియనీర్​ ఎలాన్​ మస్క్​ కూడా ఏఐ చాట్ బోట్ ​తీసుకురావాలని ప్లాన్​ చేస్తున్నారు. మైక్రో సాఫ్ట్ కు చెందిన ‘చాట్​ జీపీటీ’ దీటుగా సరికొత్త ఏఐ చాట్​బోట్​ను తీసుకొచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఆయన పలువురు ప్రముఖ ఏఐ సైంటిస్టులతో చర్చలు జరిపారంటూ ఇంటర్నేషనల్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘చాట్​ జీపీటీ’ కో ఫౌండర్స్​లో మస్క్​ కూడా ఒకరు. 2018లో ఆయన చాట్​ జీపీటీ కంపెనీ బోర్డ్​ మెంబర్​ పదవికి రాజీనామా చేశారు. టెస్లా కంపెనీ ఏఐ విభాగాన్ని స్టార్ట్​చేస్తున్నందున .. అదే టెక్నాలజీపై పనిచేసే మరో కంపెనీలో కొనసాగలేనని ఆయన అప్పట్లో వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన టెస్లా నుంచి ఏఐ చాట్​బోట్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెటా వర్స్​ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన ఫేస్​ బుక్​(మెటా)  అధినేత మార్క్​ జుకర్​బర్గ్​ఇప్పుడు ఏఐ చాట్​బోట్ అభివృద్ధిపై దృష్టిపెట్టారనే ప్రచారం జరుగుతోంది.  వాట్సాప్​, ఫేస్ బుక్​ మెసెంజర్​, ఇన్​ స్టాగ్రామ్​ లకు అనుసంధానమై పనిచేసే  ఏఐ చాట్​బోట్ ను తీసుకొచ్చేందుకు  ఆయన సన్నాహాలు చేస్తున్నారు.   ఈవిషయాన్ని స్వయంగా జుకర్​బర్గ్ ఫిబ్రవరి 28న ఫేస్ బుక్​ వేదికగా ప్రకటించారు.  చైనా టెక్​ దిగ్గజం ‘బైదూ’ కూడా ఏఐ చాట్​ బోట్​ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే ఆ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది.  గూగుల్​ కూడా ఇటీవల ‘బార్ట్’ పేరుతో ఏఐ చాట్​ బోట్​ను అనౌన్స్​ చేసింది.